రాష్ట్రస్థాయికి 16 ప్రాజెక్టుల ఎంపిక

విశాఖ విద్య: రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డ్స్‌ పోటీలకు విశాఖ జిల్లా నుంచి 16 ప్రాజెక్టులు ఎంపికై నట్లు డీఈవో ఎల్‌. చంద్రకళ, జిల్లా సైన్స్‌ అధికారి మెట్ట వెంకట విశ్వేశ్వరరావు తెలిపారు. విశాఖ జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 244 ప్రాజెక్టులు నమోదు చేసుకోగా, జిల్లా స్థాయి పోటీలకు 164 ప్రాజెక్టులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. వీటిని పరిశీలించిన న్యాయనిర్ణేతలు రాష్ట్ర స్థాయికి 16 ప్రాజెక్టులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డ్స్‌ పోటీలు ఈ నెల 23, 24 తేదీల్లో కాకినాడలో జరుగుతాయన్నారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top