పాయకరావుపేట : జాతీయ రహదారి పై విశాఖపట్నం వైపునకు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ ఆలీ తెలిపారు. నామవరం గ్రామం వద్ద మంగళవారం రాత్రి కారు ముందు ప్రయాణిస్తున్న మోటార్ బైక్ హఠత్తుగా బ్రేక్ వేయడం వల్ల అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఇద్దరు వ్యాపారం నిమిత్తం శ్రీకాకుళం వెళ్తున్నారు. కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి రాధా ఆలీసామను తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. కారులో వున్న మరో వ్యక్తి సోమ మహామ్మద్ అనే వ్యక్తి గాయపడడంతో తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి గుజరాత్‌కు చెందిన వ్యక్తి అని, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.


