మాట్లాడుతున్న ఎంఎస్‌ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ జోగారావు
మునగపాక : వేసవి సెలవులను వృఽథా చేయకుండా విజ్ఞానాన్ని అందించే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్‌ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ మళ్ల జోగారావు కోరారు. మునగపాక గ్రామీణ యువజన మందిరం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. లక్ష్యం కోసం చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. కర్ర సాము, చెస్, క్యారమ్, గీత శ్లోకాలపై శిక్షణ పెంచుకోవాలన్నారు. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మందిర సభ్యులు ఆడారి లక్ష్మణరావు, ఆడారి సూర్య చంద్రరావు, వెలగా ప్రవీణ పాల్గొన్నారు.


