మంగళవారం రాత్రి తరలించుకు వచ్చిన చెరువు మట్టి
ఎస్.రాయవరం : ఇటుక బట్టీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసినా, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా తమ బట్టీలకు అక్రమ మట్టి రవాణా ఆపబోమని ఇటుక బట్టీల యజమానులు యధావిధిగా మంగళవారం రాత్రి వమ్మవరం గ్రామంలో బట్టీల వద్దకు మట్టిని తరలించారు. యలమంచిలి కృష్ణాపురం చెరువులో అనుమతులు పొందినట్టు జేసీబీలను ఉపయోగించి దర్జాగా వమ్మవరానికి మట్టి తరలించుకు రావడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షించినా మట్టి తరలింపు ఆపకపోవడం పట్ల ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. అనకాపల్లి జిల్లా పోలీస్, అధికారులు విజిలెన్స్ ఉన్నతాధికారులకు బుధవారం మరో మారు ఫిర్యాదు చేశారు.


