‘పాలిటెక్నిక్‌’ దరఖాస్తుల విక్రయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘పాలిటెక్నిక్‌’ దరఖాస్తుల విక్రయం ప్రారంభం

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

దరఖాస్తుల విక్రయాన్ని ప్రారంభిస్తున్న

ఎండీ ప్రసాద్‌

కశింకోట: స్థానిక ఆర్‌ఈసీఎస్‌లోని రాజీవ్‌ గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యుత్‌ వినియోగదారుల కోటా కింద ప్రవేశానికి దరఖాస్తుల విక్రయం బుధవారం ప్రారంభమైంది. దరఖాస్తుల విక్రయాన్ని ఎమ్‌డి జి.ప్రసాద్‌ ప్రారంభించారు. ఈ నెల 30 వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కళాశాలలో దరఖాస్తులను పొందవచ్చు. ప్రిన్సిపాల్‌ బి.ఉమాశంకర్‌, అసోసియేట్‌ ప్రిన్సిపాల్‌ కె. శివ, విభాగాధిపతులు గణేష్‌, రమణ కుమార్‌, ఆఫీస్‌ సూపరింటిండెంట్‌ కె. శివరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement