విద్యార్థులకు క్రీడా సామాగ్రి కిట్లను పంపిణీ చేసిన కలెక్టర్ విజయ్ కృష్ణన్
తుమ్మపాల : విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సమ్మర్ క్యాంప్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి కలెక్టరేట్‌లో బుధవారం క్రీడా సామాగ్రి కిట్లను ఆమె విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రీడలు, వ్యాయామం, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ నెల 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌లను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పి.శైలజ, కోచ్ సిహెచ్ సూరి అప్పారావు, విద్యార్థులు పాల్గొన్నారు.


