ఇంటర్‌ సీబీఎస్‌ఈ ఫలితాల్లో తన్విత ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సీబీఎస్‌ఈ ఫలితాల్లో తన్విత ప్రతిభ

May 14 2026 12:25 AM | Updated on May 14 2026 12:25 AM

90.2 శాతం మార్కుల సాధన

చింతపల్లి: స్థానిక ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ (సీబీఎస్‌ఈ – బైపీసీ) చదువుతున్న పాంగి తన్విత అద్భుత ప్రతిభ కనబరిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆమె 500 మార్కులకు గాను 451 (90.2శాతం) మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన పాంగి సురేష్‌ కుమార్‌ దంపతుల కుమార్తె తన్విత సాధించిన ఈ విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన్వితతో పాటు మరికొందరు విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇదే పాఠశాలకు చెందిన లక్ష్మీ దుర్గా ప్రసన్న 450 మార్కులతో ద్వితీయ స్థానం, గౌరీ శంకర్‌ 447 మార్కులతో తృతీయ స్థానం, శెట్టి రాహిత్య హ్యుమానిటీస్‌ విభాగంలో 435 మార్కులు సాధించారు. తన్విత సాధించిన విజయంతో ఆమె కుటుంబంలో పండగ వాతా వరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కేక్‌ కట్‌ చేసి, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. గిరిజన ప్రాంత విద్యార్థులకు తన్విత విజయం ఎంతో స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్‌ మనోజ్‌ కుమార్‌ మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement