నీట్ పరీక్ష రద్దు చేయడం దారుణం. ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పరిపాటిగా మారింది. నీట్ నిర్వహణలో లోపాన్ని గుర్తించకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఎన్డీఏ ప్రభుత్వానికి తగదు. మా పాపతో పాటు ఎంతో మంది విద్యార్థులు కష్టపడి ఏడాది పాటు ప్రిపేరు అయ్యారు. తీరా పరీక్ష రాసిన తరువాత పరీక్ష రద్దు చేయడం సరికాదు. ఈ విధమైన చర్య విద్యార్ధుల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను. – వి.వి.ఎన్.హరికృష్ణ, విద్యార్థిని తండ్రి, నర్సీపట్నం


