బీసీ వసతిగృహ విద్యార్థినికి | - | Sakshi
Sakshi News home page

బీసీ వసతిగృహ విద్యార్థినికి

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

అవార్డు ప్రదానం

అవార్డు ప్రదానం

బీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత నుంచి అవార్డు అందుకుంటున్న బీసీ వసతిగృహ విద్యార్థిని రుత్తల దుర్గ

నర్సీపట్నం: ఇటీవల విడుదులైన టెన్త్‌ ఫలితాల్లో 574 మార్కులు సాధించిన బీసీ బాలికల వసతిగృహం విద్యార్థిని రుత్తల దుర్గ మంగళవారం రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంది. టెన్త్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతిగృహాల విద్యార్థులకు అమరావతిలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఎ.మల్లికార్జున్‌రావు, అడిషనల్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సత్యనారాయణ చేతుల మీదగా విద్యార్థిని దుర్గ అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకుంది. దుర్గను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వసతిగృహం వార్డెన్‌ బి.వెంకటలక్ష్మి, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement