పరీక్ష కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు
మాకవరపాలెం : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ప్రవేశ పరీక్షలకు 273 మంది విద్యార్థులు హాజరయ్యారు. తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం నుంచి ఈ ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ఈ నెల 18 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌రావు తెలిపారు. నిత్యం రెండు విడతల్లో జరిగే పరీక్షలకు గంటన్నర ముందుగా కేంద్రానికి హాజరుకావాలన్నారు. మొదటి రోజు 273 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు.


