నర్సీపట్నం : మహిళా భద్రతపై మహిళా పోలీసు సిబ్బంది దృష్టిసారించాలని, మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు మహిళా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ, నర్సీపట్నం ఇన్‌ఛార్జీ డీఎప్పీ ఈ.శ్రీనివాసులు సూచించారు. స్థానిక ప్రవేటు కళ్యాణమండపంలో డివిజన్‌లోని మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను ఆరికట్టేందుకు కృషి చేయాలని, మహిళల రక్షణపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రచార రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్ అవశ్యకతను మహిళలు, బాలికలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్, రూరల్ సీఐలు గపూర్, రేవతమ్మ, పాయకరావుపేట సీఐ శంకర్‌రావు, డివిజన్ పరిధిలో మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


