ఇటుక బట్టీలపై విజిలెన్స్‌ దాడులు | - | Sakshi
Sakshi News home page

ఇటుక బట్టీలపై విజిలెన్స్‌ దాడులు

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

ఎస్‌.రాయవరం : మండలంలో ఇటుక బట్టీలపై విజులెన్స్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వమ్మవరం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల యజమానులు అక్రమంగా చెరువు మట్టిని తరలించి ఇటుక తయారికి వినియోగిస్తున్నారని మంగళవారం సాక్షి దినపత్రికలో ‘హోంమంత్రి ఇలాకాలో మట్టి మాఫియా’ అనే శీర్షికన వార్త వెలువడింది. ఈ మేరకు విజిలెన్స్‌ అధికారులు స్పందించి వమ్మవరం ఇటుక బట్టీలపై దాడులు నిర్వహించారు. మట్టి నిల్వలను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. మట్టి ఎన్ని క్యుబిక్‌మీటర్లు ఒక్కో బట్టీవద్ద ఉన్నదీ, ఆ యజమాని ఎక్కడ నుంచి మట్టి తరలించారనే వివరాలు నమోదు చేసుకుని కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ తనిఖీలల్లో మైన్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యమూర్తి, నర్సీపట్నం ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు, సీఎస్‌డీటీ సూరి స్థానిక వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement