ప్రముఖ వైద్యుడు శ్రీరామ్మూర్తి మృతికి సంతాపం | - | Sakshi
Sakshi News home page

ప్రముఖ వైద్యుడు శ్రీరామ్మూర్తి మృతికి సంతాపం

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

బుచ్చెయ్యపేట: వడ్డాదిలో పేదల వైద్యుడిగా పేరొందిన ప్రముఖ వైద్యుడు బెన్నాబత్తుల శ్రీరామ్మూర్తి (68) (పెంటబాబు డాక్టర్‌ ) గుండె పోటుతో మృతి చెందారు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో ఉన్న తన కుమారుడి దగ్గరకు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం విశాఖలోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదు దశాబ్దాలుగా బుచ్చెయ్యపేట, చినఅప్పనపాలెం, బంగారుమెట్ట, దిబ్బిడి, ఎల్‌బీ పురం, భీమవరం, వడ్డాది, వీరవల్లి, పోతనపూడి, కుముదాంపేట, లోపూడి, శింగవరం తదితర గ్రామాల ప్రజలకు తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందించేవారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలతో పాటు నిరుపేదలకు ఫీజు తీసుకోకుండా వైద్య సేవలు అందించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేని సమయంలో, కరోనా కాలంలో కూడా పలువురికి వైద్య సేవలు అందించి పేదల పెన్నిధిగా పేరొందారు. శ్రీరామూర్తి అకాల మరణంతో పలు గ్రామాల ప్రజలు, పలువురు వైద్యులు, నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని పెద్ద కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా భార్య, కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement