‘రహదారి లేదని చెప్పడం అన్యాయం’ | - | Sakshi
Sakshi News home page

‘రహదారి లేదని చెప్పడం అన్యాయం’

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

మాట్లాడుతున్న బుద్ద మురళీ తాతారావు

అనకాపల్లి: స్థానిక మెయిన్‌రోడ్డు రఘరాం లే అవుట్‌ను ఆనుకుని ఉన్న సర్వే నంబర్‌ 1535/3లో 7.603 సెంట్ల జీరాయితీ భూమిలో గేటు నిర్మిస్తున్న సమయంలో లే అవుట్‌ ప్రతినిధి కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావు ఈనెల 9వ తేదీన తమ భూమిలో గేటు నిర్మించుకోవడం తప్పు అని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని స్థల యజమాని బుద్ద మురళీ తాతారావు అన్నారు. స్థానికంగా ఉన్న తమ భూమిలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లే అవుట్‌కు ఆనుకుని ఉన్న తమ స్థలానికి ఇటు రహదారి లేదని చెప్పడం అన్యాయమన్నారు. లే అవుట్‌ సైడ్‌ గేటు ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 50 లక్షలు చెల్లించాలని పరమేశ్వరరావు చెప్పడం తగదని మురళీ తాతారావు అన్నారు. ఇదే విషయంపై సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాతారావు కుటుంబ సభ్యులు విల్లూరి గణేష్‌, దాడి నాని, ఆడారి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement