యువకుడి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

నర్సీపట్నం : నర్సీపట్నం మండలం, గబ్బాడ గ్రామ సమీపం నెల్లిమెట్ట వద్ద యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు రూరల్‌ ఎస్‌ఐ రాజారావు తెలిపారు. రోలుగుంట మండలం, బుచ్చింపేట గ్రామానికి చెందిన లాలం సాయి కుమార్‌ (30) ఈ నెల 10వ తేదీ సాయంత్రం అదే గ్రామానికి చెందిన సతీష్‌, రాజేష్‌, నానాజీలతో కలిసి గబ్బాడ గ్రామం, నెల్లిమెట్ట వద్ద మద్యం సేవించినట్టు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం మృతుడు సాయికుమార్‌, రాజేష్‌ బైక్‌పై నర్సీపట్నం వైపు రావడం జరిగిందన్నారు. బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్‌ జరిగి సాయికుమార్‌ మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి భార్య లాలం రాజ్యలక్ష్మి సాయికుమార్‌ మృతిపై అనుమానం వ్యక్తి చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement