వార్షిక ప్రణాళిక అమలుతో మహిళా సంఘాల అభివృద్ధి
సబ్బవరం: వార్షిక ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసి, గ్రామీణ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని డీపీఎం ఐబీ పి.వెంకటరమణ సూచించారు. సబ్బవరం మండల సమాఖ్య కార్యాలయంలో ఏఏపీ–1 సెక్షన్ పరిధిలో రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సబ్బవరం మండల సమాఖ్యతో పాటు అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, గొలుగొండ, చోడవరం, యలమంచిలి మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వీవో స్థాయిలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారీ, కార్యవర్గ సభ్యులకు, ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అవగాహన కల్పించడం, బడ్జెట్ ప్రక్రియపై శిక్షణ అందించినట్లు ఆయన తెలిపారు. వీఎంవోఎస్‌ఏ అంఽశాలపై టీవోటీ కె.శ్రీనివాసరావు వివరించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తుల సృష్టి, ప్రవర్తనలో మార్పు, సుస్థిర జీవనోపాధి వంటి అంఽశాలపై సభ్యులతో చర్చించి గ్రామ, మండల స్థాయి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏడు మండలాలకు చెందిన అధికారులు, సిబ్బందితో పాటు సబ్బవరం మండలంలోని 58 గ్రామ సంఘాల లీడర్లు పాల్గొన్నారు.


