దేవాలయ భూములకు నష్టపరిహారం ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

దేవాలయ భూములకు నష్టపరిహారం ఇప్పించండి

May 12 2026 12:44 AM | Updated on May 12 2026 12:44 AM

అచ్యుతాపురం రూరల్‌ : దుప్పితూరులో పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రావతీ సమేత భావనాఋషి ఆలయ భూములకు నష్టపరిహారం ఇప్పించాలని ఆలయ కమిటీ సభ్యులు అనకాపల్లి కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా తమ సొంత నిధులతో స్వామికి నిత్య దీప ధూప నైవేద్యాలు, ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఆలయ భూములకు పరిహారంతో పాటు భూమికి భూమి ఇవ్వాలని వినతిపత్రం ద్వారా కలెక్టర్‌ను కోరారు. నష్టపరిహారం చెల్లించకుండా ఆలయ భూములను ఆక్రమిస్తున్న ఏపీఐఐసీ, బ్రాండిక్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ప్రహారీ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్‌ మాడెం సూరి అప్పారావు, ఉపాధ్యక్షుడు శేశెట్టి రాంబాబు, సెక్రటరీ మాడెం అప్పారావు, కమిటీ సభ్యులు అంజూరి అప్పలరాజు, శేశెట్టి నర్సింగరావు, శేశెట్టి నానాజీ, వానపల్లి ముకుందేశ్వరరావు, వానపల్లి సన్యాసిరావు, అముదూరి అర్జునరావు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement