పాడేరు రూరల్: ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని కాఫీ రైతుల సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పాలికి లక్కు తెలిపారు. మండలంలో వంట్లమామిడి పంచాయతీ ఓనూరు తదితర గ్రామాల్లో ఆయన సోమవారం ఉపాధి హామీ పథకం వేతనదారులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పాత విధానాన్ని కొనసాగించాలన్నారు. కొత్త విధానం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సక్రమంగా పనులు కల్పించకపోవడంతో గిరిజనులు వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని తెలిపారు. రోజు వారీ కూలీ రూ.600కి పెంచాలని డిమాండ్ చేశారు.


