సీలేరు రూట్‌లో మరో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు | - | Sakshi
Sakshi News home page

సీలేరు రూట్‌లో మరో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు

May 12 2026 12:44 AM | Updated on May 12 2026 12:44 AM

సీలేరు: విశాఖపట్నం డిపో నుంచి అనకాపల్లి జిల్లా మీదుగా సీలేరు దారాలమ్మ తల్లి ఘాట్‌ రోడ్డులో మరో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని విశాఖ ఆర్టీసీ డీఎం మాధురి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు సీలేరు వస్తుందని చెప్పారు. బస్సు సిబ్బంది భోజనానంతరం బయలుదేరి 6.30 గంటలకు భద్రాచలం చేరుకుంటుందని, మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు అక్కడ బయలుదేరి, మధ్యాహ్నం 12 గంటలకు సీలేరు చేరుకుంటుందని ఆమె తెలిపారు. అక్కడి నుంచి విశాఖప ట్నం బయలుదేరుతుందని డీఎం చెప్పారు. రిజర్వేషన్‌ సదుపాయం కూడా కల్పించామని, ఈ సర్వీసును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement