అరకులోయటౌన్: స్థానిక ప్రభుత్వ మహి ళా డిగ్రీ కళాశాలకు ఆంధ్రాయూనివర్సిటీ దూరవిద్య పరీక్ష కేంద్రం మంజూరైనట్టు ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు సోమవారం తెలిపారు. ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ 167ను కేటాయించారన్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి యూజీ థియరీ పరీక్షలు, బీఏ, బీకాం, బీఎస్సీ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దూర విద్య పరీక్ష కేంద్రం మంజూరు చేసిన ఏయూ వైస్ చాన్సలర్, సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఇతర అధికారులకు చలపతిరావు, కళాశాల అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.


