సాక్షి.పాడేరు: వేసవిలోనూ జిల్లాలో రోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఉదయం పొగమంచు,మధ్యాహ్నం వరకు అధిక ఎండ,సాయంత్రం నుంచి భారీ వర్షం కురవడం వంటి విభిన్న వాతావరణ పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి.సోమవారం జిల్లా కేంద్రం పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.రోజు వర్షాలు కురుస్తుండడంతో ప్రధాన గెడ్డలు,వాగుల్లో వరదనీరు పొంగి ప్రవహిస్తోంది.
వర్షపాతం వివరాలు: పెదబయలు 29.5, పాడే రులో 26.5, హుకుంపేటలో 26.5,చింతపల్లిలో 17.5, ముంచంగిపుట్టులో 9, కొయ్యూరులో 5.5, జి.మాడుగులలో 4.3, జీకే వీధిలో 1.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది.
పాడేరులో కురుస్తున్న వర్షం


