లబ్బూరు వద్ద మూడు బైకులు ఢీ | - | Sakshi
Sakshi News home page

లబ్బూరు వద్ద మూడు బైకులు ఢీ

May 12 2026 12:44 AM | Updated on May 12 2026 12:44 AM

ఒకరు మృతి..ముగ్గురికి తీవ్ర గాయాలు

ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామ సమీపంలో ఆదివారం మూడు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్‌ఐ పి.నాని అందించిన వివరాలు... మండలంలోని మాకవరం పంచాయతీ కిందుగూడ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు బైకుపై ముంచంగిపుట్టు నుంచి కిందుగూడ వెళ్తుండగా అదే సమయంలో మేభ గ్రామానికి చెందిన సుబ్బరావు, రెడ్డి బైకు ముంచంగిపుట్టు బయలుదేరారు. జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామ సమీపంలోని ఏకలవ్య పాఠశాల ఎదురుగా ఈ రెండు బైకులు ఢీ కొన్నాయి. అదే సమయంలో కించాయిపుట్టు పంచాయతీ కేంద్రానికి చెందిన నాగేశ్వరరావు బైకుపై వస్తుండగా.. ప్రమాదానికి గురైన రెండు బైకులు అతనిపై దుసుకుపోయాయి.దీంతో అందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.క్షతగ్రాతులను హూటహూటిన ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు.రెడ్డి పరిస్థితి విషమయంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి,అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ రెడ్డి(25) సోమవారం మృతి చెందాడు.కిందుగూడకు చెందిన నాగేశ్వరరావు పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నాడు. మేభకు చెందిన సుబ్బరావు ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో వైద్య సేవలు పొందుతున్నాడని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నాని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement