రెండేళ్లుగా చిరిగిన దోమతెరలతో ఇబ్బందులు పడుతున్నాం.వాటిని సూదులతో కుడుతున్నా ఫలితం లేక పోతోంది.దోమతెరలన్నీ చిరిగిపోవడంతో వాటిని కట్టుకున్నా దోమలు లోపలికి వచ్చి కుడుతున్నాయి.సాయంత్రం అయితే దోమల బెడద అధికంగా ఉంది.పొగపెడుతున్నా దోమ కాట్లు తప్పడం లేదు.ఈఏడాది కూడా తమ గ్రామంలో ఏకుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయలేదు.
–వంతాల మదు, ఎర్రగుప్ప గ్రామం, పాడేరు మండలం
దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు
దోమకాట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.నా భర్త భాస్కరరావు మలేరియా జ్వరంతో పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా ఇంటి వద్ద గాని, చుట్టు పక్కల ఇళ్ల వద్దగాని ఇంత వరకు దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు.దోమతెరలు కూడా పంపిణీ చేయలేదు.
–వంతాల లక్ష్మి, బక్కలపనుకు గ్రామం, పాడేరు


