ముంచంగిపుట్టు: ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ జోన్–1 జాయింట్ సెక్రటరీగా స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ లావేటి ప్రదీప్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని వెట్ హోమ్‌లో ఆదివారం నిర్వహించిన అసోసియేషన్ ఎన్నికల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు తోటి పశువైద్యాధికారులు, సిబ్బంది, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంవర్ధక రంగ అభివృద్ధికి, పశువైద్యుల సంక్షేమానికి మరియు వృత్తిపరమైన ఐక్యత కోసం అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అందరి సహకారం కోరారు.


