ఆర్మీ ఉద్యోగి భౌతికకాయం ఊరేగింపు | - | Sakshi
Sakshi News home page

ఆర్మీ ఉద్యోగి భౌతికకాయం ఊరేగింపు

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

పట్టణంలో ఊరేగింపుగా తీసుకువెళుతున్న ఆర్మీ ఉద్యోగి రాపేటి పూర్ణచంద్రరావు భౌతికకాయం

అనకాపల్లి టౌన్‌: వెంకుపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి రాపేటి పూర్ణచంద్రరావు(37) ఆర్మీలో విధులు నిర్వహిస్తూ శుక్రవారం డెహ్రాడూన్‌లో మృతి చెందారు. ఈయన మృతదేహం ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఊరేగింపుగా, పట్టణం గుండా గ్రామానికి చేరుకుంది. గ్రామానికి చేరుకున్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. తన విధుల్లో భాగంగా ట్రక్‌ నడుపుతుండగా ప్రమాదానికి గురై మరణించినట్టు బంధువులు తెలిపారు. చంద్రశేఖర్‌కు భార్య గ్రేషి, ఐదేళ్ల కుమారుడు కనిష్క్‌, రెండేళ్ల కుమార్తె కారుణ్య ఉన్నారు. ఈ అనుకోని సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement