బంగార్రాజు దంపతులకు అమ్మవారి
చిత్రపటాన్ని అందజేసి ఆలయ సహాయ
కమిషనర్ యాళ్ల శ్రీధర్
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ న్యూఢిల్లీ డైరెక్టర్ తటపర్తి బంగార్రాజు దంపతులు కుటుంబ సమేతంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. న్యూఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్‌పోర్డుకు వచ్చి అక్కడ నుంచి కారులో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ బంగార్రాజు దంపతులను శాలువాలతో సత్కరించి అమ్మవారి ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ టెన్నికోయిట్ అసోసియేషన్ చైర్మన్ కె.ఎన్.వి. సత్యనారాయణ పాల్గొన్నారు.


