మునగపాక : మునగపాక పీఏస్‌కు చెందిన హెచ్‌సీ సాగర్ మానవత్వం చాటుకున్నారు. ఉమ్మలాడకు చెందిన ఆడారి సాయి ఆదివారం సాయంత్రం తన పర్సును పోగొట్టుకున్నాడు. ఈ పర్సులో రూ.15వేల నగదుతో పాటు పలు ఏటీఎం కార్డులు ఉన్నాయి. పర్సు కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో నిస్సహాయకునిగా ఉండిపోయాడు. కాగా కేసు విచారణలో భాగంగా ఆదివారం రాత్రి ఉమ్మలాడ వెళ్లిన హెచ్‌సీ సాగర్‌కు పర్సు కనిపించింది. దీంతో పర్సులోని అడ్రసు గుర్తించి బాధితుడు సాయికి ఫోన్ చేశారు. సంబంధిత పర్సును మునగపాక పోలీసు స్టేషన్‌లో బాధితుడు సాయికి హెచ్‌సీ సాగర్ అందజేశారు. దీంతో స్టేషన్ ఎస్‌ఐ ప్రసాదరావుతో పాటు ఇతర సిబ్బంది సాగర్ మానవత్వం పట్ల అభినందనలు తెలిపారు. పోయిన పర్సు దొరకడంతో హెచ్‌సీ సాగర్‌కు బాధితుడు సాయి కృతజ్ఞతలు తెలిపాడు.


