మండుటెండలో మంచు విందు
● పోలీసుల కృషితోనే
భార్య హంతకుడికి శిక్ష
● ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా
మేఘాల కొండలుగా పేరొందిన వంజంగి హిల్స్ మండు వేసవిలోను ప్రకృతి రమణీయతతో కనువిందు చేస్తున్నాయి. శనివారం వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు వంజంగి కొండల నిండా మేఘాలు, పొగమంచు ఆకట్టుకున్నాయి. – సాక్షి, పాడేరు
నేటి నుంచి మోదమ్మ జాతర
సాక్షి, పాడేరు: మినుములూరు గ్రామంలో ఆదివారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు మోద కొండమ్మతల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మినుములూరు పాత ఊరు నుంచి మోదకొండమ్మతల్లి పాదాలు, ఘటాలను ఉదయం 7 గంటలకు ఊరేగించిన అనంతరం మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన శతకంపట్టు వద్ద కొలువుదీర్చనున్నారు. అనంతరం మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మోదమ్మకు ప్రత్యేక పూజలతో పాటు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల విజయవంతానికి అన్ని వర్గాల భక్తులు సహకరించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మినుముల కన్నాపాత్రుడు, ఇతర కమిటీ ప్రతినిధులు కోరారు.
చింతపల్లి: ఏజెన్సీలో మహిళల రక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నవరం పంచాయతీ పరిధి పూతికమెట్ట గ్రామంలో భార్యను హత్యచేసిన భర్త రామారావుకు యావజ్జీవ కారాగార శిక్ష పడడం పోలీసుల కృషి ఫలితమేనన్నారు. ఈ హత్యానేరంపై సీఐ లోతుగా విచారణ జరిపి సాక్షుల వివరాలతో న్యాయస్థానం ముందు హాజరుపరిచారన్నారు. ఈ తీర్పు మహిళలను వేధించే వ్యక్తులకు కనువిప్పు లాంటిందన్నారు. మహిళలను వేధించినా, హత్య చేసినా, శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లోను శక్తి బృందాలను పోలీసు శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు. మహిళలను ఆకతాయిలతో పాటు ఏ ఒక్కరూ వేధించినా, హింసించినా శక్తి బృందాల అప్రమత్తమై రక్షణ కల్పించడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షిస్తాయన్నారు. గిరిజన ప్రాంతంలో గంజాయిని పూర్తి స్థాయిలో కట్టడి చేశామన్నారు. గంజాయితో పట్టుబడిన నిందితులకు న్యాయస్థానం కఠినంగా శిక్షలు విధిస్తుందన్నారు. ఈ సమావేశంలో చింతపల్లి, అన్నవరం ఎస్‌ఐలు వెంకటరమణ, సాయికుమార్ పాల్గొన్నారు.


