● అరుణాచల్‌ప్రదేశ్‌అటవీ శాఖ బృందం ప్రశంస
డుంబ్రిగుడ: స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న అరకు పైనరీ అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని అరుణాచల్‌ప్రదేశ్ అటవీ శాఖ బృందం చైర్మన్ నాలోంగ్ మిజే, నాంసై ఎమ్మెల్యే జెడ్ నామ్‌సూన్ ప్రశంసించారు. శుక్రవారం రాత్రి ఇక్కడ పైనరీని సందర్శించి, బస చేశారు. గిరిజన సంప్రదాయ, సంస్కృతి పరిరక్షణపై హర్షం వ్యక్తం చేశారు. వీఎస్‌ఎస్ సభ్యులు, పైనరీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన గిరిజన వంటకాలు, అరకు కాఫీని ఆస్వాదించారు. సంప్రదాయ థింసా నృత్యంతో సందడి చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం పీసీడీఎఫ్ పి.సుబ్రహ్మణ్యం, ఏపీఎఫ్‌డీసీ శ్రీకంఠనాథ్‌రెడ్డి, పాడేరు డీఎఫ్‌వో ఉమా మహేశ్వర్, పైనరీ మేనేజర్ చంద్రశేఖర్, వీఎస్‌ఎస్ చైర్మన్ భారతి పాల్గొన్నారు.


