నాతవరం: రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన అనిమిరెడ్డి జస్వత్ మండలానికే వన్నె తెచ్చాడని నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు అభినందించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాతవరం హైస్కూల్లో చదువుతున్న జస్వంత్ అనకాపల్లి జిల్లా జట్టు తరపున బేస్‌బాల్ పోటీలలో పాల్గొన్నారన్నారు. ఈ నెల 5,6,7, తేదీల్లో కర్నూల్ జిల్లా వెనుగొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జస్వంత్ ప్రతిభ చూపించడంతో సెమీఫైనల్‌కు చేరుకోవడం జరిగిందన్నారు. మారుమూల నాతవరం మండలం నుంచి జిల్లా తరఫున క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఈ జట్టు తరుఫున పోటీల్లో నర్సీపట్నం, మాకవరపాలెం మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని ఎస్‌ఐ తెలిపారు.


