నీలిబందలో వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

నీలిబందలో వైద్య శిబిరం

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

రోలుగుంట: మండలం అర్ల గిరిజన పంచాయతీ శివారు నీలబంద గ్రామంలో బుచ్చింపేట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నీలిబందలో జ్వరాలు శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. వైద్యుడు ఎల్‌.శివప్రసాద్‌ సిబ్బందితో కలసి గ్రామంలో జ్వరపీడితుల ఇళ్లను సందర్శించారు. రోగులను కలసి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. దీనిలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు చేశారు. రక్తపు నమూనాలు తీశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వేడి ఆహారం, మరగకాచిన నీటిని తాగాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement