రోడ్డుపై పశువులను వదిలితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డుపై పశువులను వదిలితే చర్యలు

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

8లో

పాత తేదీల్లోనే వేడుకలు

మోదకొండమ్మ తల్లి ఉత్సవాల తేదీలను కూటమి ప్రభుత్వం కావాలనే మార్చడం అత్యంత అన్యాయం. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని, ఆ కారణంగా పాత తేదీల్లో జాతర నిర్వహిస్తే పోలీసు బందోబస్తు ఇవ్వలేమని ఉన్నతాధికారులతో చెప్పించడం ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దల కుట్రలో భాగమే. ఎన్నికలు, కౌంటింగ్‌ ప్రక్రియలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయనే వాస్తవాన్ని అమ్మవారి భక్తులందరూ గమనిస్తూనే ఉన్నారు. కేవలం రాజకీయ విద్వేషంతోనే పోలీసు బందోబస్తును సాకుగా చూపి తేదీలను మార్చడం శోచనీయం. మే 12వ తేదీన అమ్మవారి పుట్టినరోజు. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాల ప్రకారం ఆ రోజే పండుగ జరపాలని భక్తులంతా బలంగా నమ్ముతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మేము పెద్దల సమక్షంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం.. పాత తేదీల్లోనే (మే 10, 11, 12) అమ్మవారి పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. తెలుగు రాష్ట్రాలలోని భక్తులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రులు కావాలని కోరుతున్నా.

– మత్స్యరాస విశ్వేశ్వరరాజు,

పాడేరు ఎమ్మెల్యే, మోదకొండమ్మ

ఆలయ కమిటీ చైర్మన్‌

Advertisement
 
Advertisement
Advertisement