బురదనీరే శరణ్యం | - | Sakshi
Sakshi News home page

బురదనీరే శరణ్యం

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దూరంగా ఉన్న ఊటగెడ్డ నీటిపైనే నిత్యం ఆధారపడుతున్నాం. అంతదూరం నుంచి నీళ్లను మోసుకుని తీసుకురావడానికి నరకం చూస్తున్నాం. వర్షాలు కురిస్తే మరిన్ని ఇబ్బందులు పడాల్సిందే. బురద నీరే శరణ్యం.

– సీదరి రోజా, దాయత్తి,

అనంతగిరి మండలం

విన్నవించినా చర్యలు శూన్యం

గ్రామంలో రూ.15లక్షలతో తాగునీటి పథకాన్ని గత ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిచిపోయాయి. బోరు ఒక్కటే తవ్వారు. ట్యాంకుల నిర్మాణాలు కూడా జరగలేదు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సమస్యను కలెక్టర్‌, పీవోలకు విన్నవించినా ఉపయోగం లేదు.

– పాంగి చిన్నమ్మలు, కొత్తపాడేరు,

పాడేరు మండలం

Advertisement
 
Advertisement
Advertisement