10 నుంచి హనుమజ్జయంతి పూజలు | - | Sakshi
Sakshi News home page

10 నుంచి హనుమజ్జయంతి పూజలు

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

సింహాచలం: సింహగిరి మెట్లమార్గంలో కొలువై ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 10 నుంచి 12 వరకు హనుమజ్జయంతి పూజలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సహస్రనామార్చన, సుందరకాండ పారాయణం నిర్వహిస్తారు. 11న ఉదయం 6 గంటల నుంచి స్వామికి అభిషేకం, 8 గంటల నుంచి సహస్రనామార్చన, సుందరకాండ పారాయణం ఉంటాయి. 12న హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఉదయం 6 గంటల నుంచి పంచామృతాభిషేకాలు, 7 గంటలకు విశేష అలంకరణ చేస్తారు. 7.30 గంటల నుంచి లక్ష తమలపాకుల పూజ, 9 గంటల నుంచి పట్టాభిషేక పారాయణం, 9.30 గంటల నుంచి హవనం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విశేష పూజల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు, ప్రసాదాలను స్వీకరించాలని ఈవో కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement