చింతపల్లి: రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిలో సాయిరాం బుధవారం చింతపల్లిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి, అందుతున్న సేవలను పరిశీలించారు.తొలుత స్థానిక ఏరియా ఆస్పత్రికి వెళ్లిన ఆయన, అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజనం నాణ్యతపై ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి భవనం చిన్నదిగా ఉండటం వల్ల రోగుల సంఖ్య పెరిగినప్పుడు బెడ్స్ సరిపోవడం లేదని పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై సాయిరాం స్పందిస్తూ.. నూతన ఆస్పత్రి భవన నిర్మాణం తుది దశకు చేరుకుందని, అది పూర్తయిన వెంటనే రోగులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా భవనాన్ని పూర్తి చేయిస్తామని ఇంజనీరింగ్ అధికారులు ఈ సందర్భంగా కమిషన్ సభ్యునికి వివరించారు. ఈ పర్యటనలో ఆస్పత్రి పర్యవేక్షకురాలు నీలవేణి, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి, వార్డెన్ వినాయకరావు, ఏఎంసీ డైరెక్టర్ బేతాళుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలను సకాలంలో అందజేయాలని తహసీల్దారు శంకర్రావును కోరారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు నరేంద్ర పాల్గొన్నారు.
రోగుల సమస్యలు తెలుసుకున్న
రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిలో సాయిరాం


