త్రిశక్తి ఆలయంలో ధ్వజస్తంభానికి శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

త్రిశక్తి ఆలయంలో ధ్వజస్తంభానికి శంకుస్థాపన

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

ఉక్కునగరం: జీవీఎంసీ 87వ వార్డు లక్ష్మీపురం కాలనీలోని త్రిశక్తి అమ్మవార్ల ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గాజువాక వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి తిప్పల దేవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. కార్యక్రమంలో వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బొడ్డ గోవింద్‌, గాజువాక బీసీ సెల్‌ అధ్యక్షుడు చిత్రాడ వెంకటరమణ, 76వ వార్డు పరిశీలకుడు ముద్దపు దామోదర్‌, కమిటీ ప్రతినిధులు సూర్యనారాయణ, కనకారావు, బాబూరావు, అప్పలరాజు, ప్రసాద్‌, అంజయ్య, కనకారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement