11 నుంచి పైడితల్లి అమ్మవారి జాతర | - | Sakshi
Sakshi News home page

11 నుంచి పైడితల్లి అమ్మవారి జాతర

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

భీమునిపట్నం: భీమిలి లోని నేరెళ్లవలస కాలనీ లోని గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఈనెల 11 నుంచి 13వతేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు జరగనున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వేడుకల్లో భాగంగా 11 తొలేళ్ల ఉత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఊరేగింపు జరుగుతుంది. ఇందులో నేలవేషాలు, సాముగారడీలు, చెక్కభజనలతో పాటు పెద్ద ఎత్తున బాణాసంచా విన్యాసాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 12న అనుపు వేడుక సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించడం, మొక్కులు చెల్లింపులు జరుగుతాయని, 13న అమ్మవారికి కుంకుమ పూజలతో పాటు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement