రావికమతం: అస్వస్థతకు గురై ఓ ఉపాధి వేతనదారుడు మృతిచెందాడు. మండలంలో మేడివాడకు చెందిన కుంచాల శ్రీనివాస్ (40)బుధవారం గ్రామంలో ఉపాధి పనికి వెళ్లాడు. 10 గంటల సమయంలో అస్వస్థతకు గురవడంతో ఇంటికి వెళ్లిపోయాడు. కొంతసేపటికి అపస్మారక స్థితికి చేరుకోవడంతో రావికమతం పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండడంతో కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది సూచించారు. అయితే కుటుంబ సభ్యులు రావికమతంలో గల ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. శ్రీనివాస్ ఉపాధి పనులు చేయడంతో పాటు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య మల్లేశ్వరి, కుమారుడు,కుమార్తె ఉన్నారు.


