వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు దారుణం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు దారుణం

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

● మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ రామకృష్ణ

నర్సీపట్నం: స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అనుచరులే దాడి చేసి తమ నాయకులపై కేసులు పెట్టడం దారుణమని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కోనేటి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్పీకర్‌ సొంత నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం ఒకేలా ఉండదని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందన్న విషయం టీడీపీ నాయకులు గుర్తించుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement