కారు ఢీకొని యాచకురాలు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని యాచకురాలు దుర్మరణం

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

యలమంచిలి రూరల్‌: మండలంలో పులపర్తి దాటిన తర్వాత నయారా పెట్రోల్‌ బంక్‌ సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్టు యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. రహదారిపై నడిచి వెళ్తుండగా యలమంచిలి నుంచి తుని వైపు వెళ్తున్న కారు ఆమెను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుంది. యాచకురాలుగా భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియలేదని,ఎవరికై నా తెలిస్తే 9440796104 నంబరుకు ఫోన్‌ చేయాలని ఎస్‌ఐ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement