అనకాపల్లి: మండలంలోని తుమ్మపాలలో క్వారీ (మెస్సర్స్ ఆర్‌ఎంసీ రెడిమిక్స్ ఇండియా) కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని కూటమి నేతలు వ్యతిరేకించారు. క్వారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దని పది మంది వ్యతిరేకించగా, ఐదుగురు మాత్రం అంగీకారం తెలిపారు. క్వారీ వల్ల గ్రామంలో ప్రజలు వివిధ రకాల వ్యాధులు బారిన పడుతున్నామన్నారు. తుమ్మపాల సర్వే నంబర్ 04లో 4.90 హెక్టారులో రోడ్డు మెటల్, బిల్డింగ్ స్టోన్ తవ్వకాలకు 74,901 క్యూబిక్ మీటర్ల నుంచి 2,66,410 క్యూబిక్ మీటర్లకు గ్రావెల్ 14,021 క్యూబిక్ మీటర్లను సంవత్సరానికి తవ్వకాలు చేపట్టారన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ఆర్డీవో షేక్ అయిషాకు క్వారీకి అనుమతులు ఇవ్వద్దని వినతిపత్రం అందజేశారు.


