ఎన్‌డీడీ బోర్డు బృందం సందర్శన | - | Sakshi
Sakshi News home page

ఎన్‌డీడీ బోర్డు బృందం సందర్శన

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

కశింకోటలోని డెయిరీ ఫాం పరిశీలిస్తున్న ఎన్‌డీడీ బోర్డు ప్రతినిధుల బృందం

కశింకోట: స్థానిక సంఘ మిత్ర పోడర్‌ గ్రోయర్స్‌ అండ్‌ ప్రొడ్యూసర్స్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీని జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు బృందం బుధవారం సాయంత్రం సందర్శించింది. ఈ సందర్భంగా ఇక్కడి పశుగ్రాస క్షేత్రాలు, డెయిరీ ఫారం, బయో గ్యాస్‌ ప్లాంట్‌ యూనిట్‌ను పరిశీలించింది. బృందంలో బోర్డు ప్రతినిధులు లతా, సదాశివం, అనూష హాజరయ్యారు. పాడి రైతుల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు తమ బోర్డు నుంచి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. రైతులంతా సంఘంగా సంఘటితమై అభివృద్ధి చెందడానికి కృషి చేయాలన్నారు. సొసైటీ చైర్మన్‌ శిలపరశెట్టి చిట్టమ్మ, ఉపాధ్యక్షుడు ఎ. అప్పలనాయుడు, బోర్డు డైరెక్టర్లు బొడ్డేడ బాలాజీ, కాండ్రేగుల నాగేశ్వరరావు, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement