పెదబయలు: ఈదురుగాలతో కూడిన భారీ వర్షానికి మండలంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలిపోయాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిపోయాయి. మరి కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో పెదబయలు,ముంచంగిపుట్టు మండలాల్లో 46 పంచాయతీలకు సోమవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 33కేవీ లైన్ మరమ్మతులకు గురి కావడంతో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. పెదబయలు నుంచి పాడేరు వెళ్లే మార్గంలో పడిన చెట్లను తొలగించి, తెగిపోయిన విద్యుత్ వైర్లను విద్యుత్‌శాఖ అధికారులు సరిచేస్తున్నారు.రెండు మండలాల్లో విద్యుత్ సరఫరా లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


