జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి ఆదేశం
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదేవత పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవాలను ఈనెల 17,18,19తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం కావాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ప్రచార పోస్టర్‌ను మంత్రి సోమవారం ఆవిష్కరించారు.అధికారులు,ఉత్సవ,ఆలయ కమిటీ ప్రతినిధులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.తాగునీరు,ఆహారం,విశ్రాంతి గదులను సిద్ధం చేయాలని సూచించారు. 100 ప్రత్యేక బస్సులు నడపాలని, పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.ఉత్సవాల మూడు రోజులు ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో కలెక్టర్ టి.నిశాంతి, ఎస్పీ అమిత్‌బర్దర్, జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ,ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి,పలుశాఖల అఽధికారులు,ఉత్సవ,ఆలయ కమిటీ ప్రతినిధులు,పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.


