మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

May 5 2026 6:44 AM | Updated on May 5 2026 6:44 AM

పెదబయలు: వారపు సంతలో చెట్టు పడి మృతి చెందిన మహిళల కుటుంబాలకు అండగా ఉంటామని ఒడిశా రాష్ట్రం పొట్టంగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్ర కడం అన్నారు.పెదబయలు వారపు సంతలో చెట్టు పడి ఇద్దరు మహిళలు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన సోమవారం సాయంత్రం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను, వారి కుటుంబాలను పరామర్శించారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలని కోరారు. ఒడిశా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంఅందజేస్తామని చెప్పారు. చెట్టు పడి మృతి చెందిన దుర్ఘటన తీవ్రంగా బాధించిందన్నారు.ఈ కార్యక్రమంలో పొట్టంగి నియోజకవర్గ ఇన్‌చార్జి కమిడి కామేష్‌, బ్లాక్‌ ప్రెసిడెంట్‌ మదన్‌,జిల్లా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ రామకృష్ణ పడాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఒడిశా రాష్ట్రం పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కడం

Advertisement
 
Advertisement
Advertisement