గడువులోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి

May 5 2026 6:44 AM | Updated on May 5 2026 6:44 AM

పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో నిర్మిస్తున ప్రభుత్వ మెడికల్‌ కళాశాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. కళాశాల నిర్మాణ పనుల పురోగతిపై కళాశాల ప్రిన్సిపాల్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, ఏపీ ఎస్‌ఎంఐడీసీ ఎస్‌ఈ, ఈఈ, డీఈలు, కాంట్రాక్టర్లతో సోమవారం ఆమె సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్ధేశించిన గడువులోగా మెడికల్‌ కళాశాలకు సంబంధించిన అన్ని భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. అవసరమైన ఫర్నిచర్‌, ఇతర పరికరాలను అమర్చుకోవాలని అధికారులను ఆదేశించారు.కళాశాల విద్యార్థులకు, రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తూ ప్రణాళికతో పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, జీజీహె చ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, ఏపీఎంఐడీసీ ఎస్‌ఈ విజయభాస్కర్‌, డీఈ వర్మ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిషాంతి ఆదేశం

Advertisement
 
Advertisement
Advertisement