అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుంచి కుటుంబసమేతంగా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొంతమంది భక్తులు ఆలయం వద్ద వంటకాలు చేసి నైవెద్యంగా సమర్పించారు. అమ్మవారి ఆలయానికి నిత్యం కూరగాయలు ఉచితంగా అందజేస్తున్న వ్యాపారవేత్త మళ్ల జగ్గాప్పారావు దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించు కున్నారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు భక్తులకు ఉచితంగా మజ్జిగ, ప్రసాదం, తాగునీరు అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్‌లు ఏర్పాట్లు చేశారు. పట్టణ, ట్రాఫిక్ సీఐలు జి.ప్రేమ్‌కుమార్, ఎం.వెంకటనారాయణలు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.


