‘బ్రాండిక్స్‌లో కాంట్రాక్ట్‌ అడగడం అవాస్తవం’ | - | Sakshi
Sakshi News home page

‘బ్రాండిక్స్‌లో కాంట్రాక్ట్‌ అడగడం అవాస్తవం’

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

అచ్యుతాపురం రూరల్‌: దుప్పితూరు గ్రామంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అడిగితే, బ్రాండిక్స్‌ పరిశ్రమలో కాంట్రాక్ట్‌లు అడిగామని తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని వైఎస్‌ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు ఆదివారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. బ్రాండిక్స్‌ పరిశ్రమలో గతంలో ఎన్నడూ తాను కాంట్రాక్ట్‌లు కావాలని పాకులాడలేదని బ్రాండిక్స్‌ ఇండియా భాగస్వాముల్లో ఒకరైన దొరస్వామి శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్‌ యాజమాన్యంతో కుమ్మకై ్క వారి దగ్గర వందల కోట్ల రూపాయలు తీసుకొని లబ్ధిపొంది దుప్పితూరు గ్రామంలో ప్రహరీ నిర్మాణ పనులు జరగడానికి సహకరించి తెరవెనుక కూటమి ప్రభుత్వం అండదండలతో నిర్వాసితులకు అన్యాయం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. బ్రాండిక్స్‌ నుంచి కాంట్రాక్ట్‌లు అడిగానని పచ్చమీడియా పత్రికల్లో అవాస్తవాలు రాయించారని అన్నారు. గ్రామంలో కొందరు కూటమి నేతలు కాంట్రాక్ట్‌లు దక్కించుకొని ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని, దొరస్వామి చౌదరి స్థానిక కూటమి నేతలు, పోలీసుల సహాయంతో నిర్వాసితులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. స్ధానికంగా దుప్పితూరు గ్రామ సర్పంచ్‌గా, మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న తనపై తప్పుడు అరోపణలు చేసి బురద జల్లితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. సమావేశంలో తనకు మద్దతుగా ఎస్‌ఈసీ మెంబర్‌ బోదెపు గోవింద్‌, మండల వైస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు కోన లచ్చన్నాయుడు, కో–జెడ్‌పీటీసీ నర్మాల కుమార్‌, యలమంచిలి వైఎస్‌ఆర్‌సీపీ పట్టణ బొద్దపు యర్రయ్య దొర, కూండ్రపు వెంకునాయుడు, బలిరెడ్డి శ్రీను, జువ్వల నాయుడు, మాడెం సూరి అప్పారావు, దుంగా రమణ, దొడ్డి కృష్ణ అధిక సంఖ్యలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement