
జీఎస్టీ తగ్గింపుపై అవగాహన
రంపచోడవరం: దేశంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్ ద్వారా భారీగా వివిధ వస్తువులపై పన్నులు తగ్గించినట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో ఏడు మండలాల సంబంధించిన మహిళా సంఘాల సభ్యులతో వర్తక సంఘాలతో, అంగన్‌వాడీ తదితర శాఖల అధికారులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో స్మరణ్‌రాజ్ మాట్లాడుతూ రోజు నిత్యావసరాల వస్తువులపై ఐదు శాతం వరకు పన్నులు చాలా వరకు తగ్గినట్టు చెప్పారు. మండలాల పరిధిలో గల సచివాలయాల్లో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన కళాకారులతో కళాజాత నిర్వహించారు. ఏపీవో రమణ, ఏడీఏ రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.