విశేషంగా ఆర్జిత సేవలు | - | Sakshi
Sakshi News home page

విశేషంగా ఆర్జిత సేవలు

Jun 13 2025 5:13 AM | Updated on Jun 13 2025 5:13 AM

విశేషంగా ఆర్జిత సేవలు

విశేషంగా ఆర్జిత సేవలు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా జరిపారు. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవ స్త్రాలను అందించారు.

వైభవంగా నిత్యకల్యాణం

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుంచి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement